Posts

గాయం ‌ఆపని‌ యాత్ర...!

Image
ysrcp party, jaganmohanreddy, ysrcparmy వై.ఎస్.జగన్ పై ఇటీవల దాడి జరిగిన విషయం అందరికీ తెలిసినదే.. ఎన్నో అనుమానాలకు దారి తీసిన ఈ ఘటన, అందరిలోనూ ఉత్కంఠ రేపింది. జనాదరణ ఉన్న నాయకుడిపై దాడి జరిగితే,అ దాడికి గల కారణాలు వెలికి  తీయడంలో   ప్రభుత్వం  వైఫల్యం చెందిందనే  చెప్పాలి, ఈ ఘటనతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో అర్థ అవుతోంది. ఈ సంఘటన జగన్ అభిమానులకే కాక రాష్ట్ర ప్రజలందరికీ కలవరానికి గురిచేసింది. ఆశయ సాధనలో నిరంతరం పాటుపడే వ్యక్తి శరీరానికి గాయపరిచారు గాని. గుండెలోని సంకల్పాన్ని ఏనాటికి గాయపరచలేకపోయారు.  మళ్లీ యాత్రను పునః ప్రారంభిస్తూ తనవారి కోసం నవ్వుతూ నడక మొదలైంది. ప్రభంజనంలా దూసుకు పోతూ  పలకరిస్తూ సాగిపోతుంది. పడిలేచే కెరటంలా అలసట లేకుండా తన యాత్రను కొనసాగిస్తూ , ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల సమస్యలు వింటూ సాగిపోతోంది జగన్ ప్రజాసంకల్ప యాత్ర...

సార్వభౌముడిగా చరిత్రలో నిలిచాడు

Image
Y.S Rajasekhar Reddy , it's not a name it's a Brand  చీకట్లను తరిమేస్తూ వెలుగుల ఉదయిస్తాయి. అలాగే  చెడుని  రూపుమాపిననాడే మంచి ఊపిరి  పోసుకుంటుంది.   మంచి చేయాలని అనుకుంటే సరి కాదు, అది మనస్సు నుంచి పుట్టాలి అలా చేసేవారు కొందరే పుడుతారు. అటువంటి వారు చిరస్మరణీయులుగా చరిత్రలో మిగిలిపోతారు. రాజకీయం అంటేనే ముళ్ళ కిరీటం లాంటిది. అయితే  తమ సొంత  ప్రయోజనాల కోసం ప్రజల  జీవితాల్ని పణంగా పెట్టి గద్దెనెక్కి, అధికారంలోకి రాగానే  ప్రజలను గాలికొదిలేసే రాజకీయనాయకులు లేకపోలేరు. ఇలాంటి  రాజకీయనాయకుల వలన   ప్రజల జీవితాల్లో వెలుగులు హరించుకుపోయాయి. "దేశానికి రైతు వెన్నుముక." అటువంటి రైతుల జీవితాలు   బీడు భూముల్లో బలైపోయాయి. కరువు కాటకాలకు బలియై , బ్రతుకు తెరువుకోసం భూములను, బిడ్డలను వదిలి పట్టణాలకు వలస పోయి ఆకలి ఆర్తనాదాలు చేస్తూ, సహాయం చేసేవారి   కోసం ఎదురు చూస్తూ, కన్నీళ్ల కడలిలో ఒడ్డుకు చేరడం కోసం  అనేక కష్టాలనోర్చి , కాలాన్ని నెట్టుకొచ్చేవారు.జబ్బు చేసి వైద్యం చేసుకునే స్తోమత లేక  కాటికి కాలు చార్చి  ఎదురు  చూపులు తప్ప మరి ఏ దిక్కు లేని పరిస్థితి అప్పుడు. దారిద్రమే  దిక్క