సార్వభౌముడిగా చరిత్రలో నిలిచాడు


Y.S Rajasekhar redddy life story, Y S Rajasekhar reddy
Y.S Rajasekhar Reddy , it's not a name it's a Brand 

చీకట్లను తరిమేస్తూ వెలుగుల ఉదయిస్తాయి. అలాగే  చెడుని  రూపుమాపిననాడే మంచి ఊపిరి  పోసుకుంటుంది.   మంచి చేయాలని అనుకుంటే సరి కాదు, అది మనస్సు నుంచి పుట్టాలి అలా చేసేవారు కొందరే పుడుతారు. అటువంటి వారు చిరస్మరణీయులుగా చరిత్రలో మిగిలిపోతారు.


రాజకీయం అంటేనే ముళ్ళ కిరీటం లాంటిది. అయితే  తమ సొంత  ప్రయోజనాల కోసం ప్రజల  జీవితాల్ని పణంగా పెట్టి గద్దెనెక్కి, అధికారంలోకి రాగానే  ప్రజలను గాలికొదిలేసే రాజకీయనాయకులు లేకపోలేరు. ఇలాంటి  రాజకీయనాయకుల వలన   ప్రజల జీవితాల్లో వెలుగులు హరించుకుపోయాయి.


"దేశానికి రైతు వెన్నుముక." అటువంటి రైతుల జీవితాలు   బీడు భూముల్లో బలైపోయాయి. కరువు కాటకాలకు బలియై , బ్రతుకు తెరువుకోసం భూములను, బిడ్డలను వదిలి పట్టణాలకు వలస పోయి ఆకలి ఆర్తనాదాలు చేస్తూ, సహాయం చేసేవారి   కోసం ఎదురు చూస్తూ, కన్నీళ్ల కడలిలో ఒడ్డుకు చేరడం కోసం  అనేక కష్టాలనోర్చి , కాలాన్ని నెట్టుకొచ్చేవారు.జబ్బు చేసి వైద్యం చేసుకునే స్తోమత లేక  కాటికి కాలు చార్చి  ఎదురు  చూపులు తప్ప మరి ఏ దిక్కు లేని పరిస్థితి అప్పుడు.
దారిద్రమే  దిక్కై బ్రతుకుతున్నారు ప్రజలు . ఆంధ్ర రాష్ట్రం అతలాకుతలమై చెప్పుకునే నాధుడు లేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. జబ్బు చేసిన ఈ సమాజం దరిద్రాన్ని తరిమి కొట్టే నాయకుడి కోసం  ఎదురు చూశారు. ఇంకెవరు వస్తారు తమ బతుకులను మార్చే వ్యక్తి ఎవరు ఉంటారు ఎటు చూసినా స్వార్ధం, కుళ్ళు రాజకీయాలు .ఎటు చూసినా అవినీతి, ఇక తమ బ్రతుకులు మారవు ఇంతే అనుకుంటున్న స్థితిలో..!


ఒక అడుగు నడిచింది..!! తనవారంటూ  హృదయాలని హత్తుకుంటూ కన్నీళ్లను తుడుస్తూ కష్టాలలో తానున్నానని ఓదారుస్తూ ముందుకు సాగింది.  చిరునవ్వుతో పలకరిస్తూ కన్నీళ్ల  వేదనను వింటూ  వారి బాధలను  దూరం చేసింది ఆ అడుగు..!
ఆ నడకకు నేలతల్లి పులకరించింది.. ప్రతి తెలుగోడి  గుండె గోడును తీరుస్తూ ముందుకు సాగింది   ఆ రాజసం. అందరి జీవితాల్లో వెలుగులు నింపింది ఆ హస్తం.రాజకీయాల్లో ఒక కొత్త ఒరవడిని తెచ్చింది ఆ  అడుగు.. ప్రజల జీవితాలలో వెలుగును చూడటమే లక్షంగా ముందుకు సాగిన  ఆ చిరునవ్వు, ఆ రాజసం ఒక వ్యక్తి కాదు ప్రజల గుండెల్ని గెలుచుకున్న ఓ శక్తి


                                  ఆ శక్తే  "వైఎస్  రాజశేఖర్ రెడ్డి "

Comments

Popular posts from this blog

గాయం ‌ఆపని‌ యాత్ర...!